21
Apr

అందని పెదాలు తీయన..!!!

చక్కెరపలుకుల నా చక్కని జాబిలి అధరాలని అందుకోవాలని రేగింది ఓ తపన…!!!
ఎందుకీ కలవరం నాలో…?
ఈ మైకం ఎవరి చలవో..!
విరజాజిసొగసుల నా విరిబోణి పెదాలపై…
ఈ ప్రేమకార్మికుని హాజరుసంతకం పెట్టాలని ఓ భావన..
అందించి అమృతం పంచుతావో…దూరం నెట్టి విరహం రేపుతావో..
నీ అధరసాగరమధనం కోసం నేను చేసే ప్రతి దాడి లో నాకు మిగిలేది నైరాశ్యమే…
తుంటరి ఆలోచనలు ఓడిపోయి ఒంటరి అయిపోతే.. వైరాగ్యమే…!!
గుండె లోతుల్లో గుబులు రేపుతున్న ఈ కోరికను ఇలానే అదిమిపెట్టనా…
లేక..
నా చెలి లేత పెదాలను ముద్దాడే మరో ప్రయత్నం కొనసాగించనా…
ఎందుకంటే..
అందని ప్రేయసి పెదాలు.. ఎప్పటికీ తీయన..!

Comments are closed.