18
Mar

సంగీతమా.. నీకు అభివందనం.

సరిగమపదనిస.. అయ్యావు నీవు మా ఉచ్చ్వాస నిశ్వాస.
స్వర ధారలై ప్రవహిస్తావు..నరనరాలని ప్రేరేపిస్తావు..
అమ్మ పాడే లాలిపాటవి…ఆలి పాడే సరస గీతానివి..
నువ్వు బండరాళ్ళను సైతం కరిగిస్తావు..గుండె లోతుల్లోకి చొచ్చుకెల్తావు.
వీణపై బాణివై వినిపిస్తావు..సంగీత సామ్రాజ్యాల రాణీవై శాసిస్తావు .

నీవు సైతం రోగనివారిణివి…సక్రమ శృతిలయల భోగ విలాసినివి..
గానగంధర్వులకు జన్మనిస్తావు…ఘంటసాలతో మెరుగులు అద్దుకుంటావు..
ఖండంతరాలను కలుపుతావు.. అఖండ సామ్రాజ్యాలను స్థాపిస్తావు..
ఇలపై సాటిలేనిదానవు.. ఇళయరాజాల ఇంటి ఇలవేల్పు వైనావు..

ఓ సంగీతమా…
నిత్య నూతనం నీ జన్మ..
ఆనందిస్తుంటాడు నిన్ను సృష్టించినందుకు ఆ బ్రహ్మ.
నీ సంగీత ఝరులలో సేద తీరుతున్న మమ్మల్ని ఎల్లప్పుడూ ఇలానే ఆశిర్వదించవమ్మా …

Comments are closed.