Poetry

21
Apr

ఇకనైనా.. మన్నించవా…!!

సరిహద్దులే లేని నా ప్రేమకు కంచెలు కట్టి వంచన చేసావు… సంబరాలు చేసుకునే ఈ హ్రిదయానికి ఇక అంబరాన్నంటే అధ్రుష్టమీయవా..? తుషారపవనాలు వీచే ఈ వెన్నెల గాలిని.. నీ ఉక్రోష ఉష్నాగ్ని తో దహించివేసావు.. తక్షణమే నీ హ్రిదయవీక్షణ తో దర్శించి మోక్ష మన్దించవా… నీ ప్రేమమైకంలో సర్వకాలాలని ఏకకాలం లో వీక్షిస్తున్న నాకు.. నీ అనుబంధాల గమ్యాన్ని.. అందుకోటానికి చేస్తున్న ఈ ఆరోహణ అవరోహణ క్రమంలో… నన్ను నేను గాయపర్చుకుంటున్నా  చెలీ…. నన్ను ఇకనైనా ఆదుకోవా…. [...]

21
Apr

అందని పెదాలు తీయన..!!!

చక్కెరపలుకుల నా చక్కని జాబిలి అధరాలని అందుకోవాలని రేగింది ఓ తపన…!!! ఎందుకీ కలవరం నాలో…? ఈ మైకం ఎవరి చలవో..! విరజాజిసొగసుల నా విరిబోణి పెదాలపై… ఈ ప్రేమకార్మికుని హాజరుసంతకం పెట్టాలని ఓ భావన.. అందించి అమృతం పంచుతావో…దూరం నెట్టి విరహం రేపుతావో.. నీ అధరసాగరమధనం కోసం నేను చేసే ప్రతి దాడి లో నాకు మిగిలేది నైరాశ్యమే… తుంటరి ఆలోచనలు ఓడిపోయి ఒంటరి అయిపోతే.. వైరాగ్యమే…!! గుండె లోతుల్లో గుబులు రేపుతున్న ఈ కోరికను [...]

18
Mar

సంగీతమా.. నీకు అభివందనం.

సరిగమపదనిస.. అయ్యావు నీవు మా ఉచ్చ్వాస నిశ్వాస. స్వర ధారలై ప్రవహిస్తావు..నరనరాలని ప్రేరేపిస్తావు.. అమ్మ పాడే లాలిపాటవి…ఆలి పాడే సరస గీతానివి.. నువ్వు బండరాళ్ళను సైతం కరిగిస్తావు..గుండె లోతుల్లోకి చొచ్చుకెల్తావు. వీణపై బాణివై వినిపిస్తావు..సంగీత సామ్రాజ్యాల రాణీవై శాసిస్తావు . నీవు సైతం రోగనివారిణివి…సక్రమ శృతిలయల భోగ విలాసినివి.. గానగంధర్వులకు జన్మనిస్తావు…ఘంటసాలతో మెరుగులు అద్దుకుంటావు.. ఖండంతరాలను కలుపుతావు.. అఖండ సామ్రాజ్యాలను స్థాపిస్తావు.. ఇలపై సాటిలేనిదానవు.. ఇళయరాజాల ఇంటి ఇలవేల్పు వైనావు.. ఓ సంగీతమా… నిత్య నూతనం నీ [...]

18
Mar

Palle Sourabham

నా పల్లెసీమ గుర్తుకు వస్తోంది… ఆ పచ్చని పైర చేలల్లో పశువులు మేపే గొల్లభామ కూడా గుర్తుకు వస్తోంది…. చెరువు గట్లపై చేపల వేట.. మామిడి చెట్ల పై చిన్ననాటి ఆటా పాట.. ముద్దబంతి తోటల్లో జంట తూనీగల సయ్యాట… అంతా నేడు గుర్తుకు వస్తోంది… తొలకరి చినుకులకి తడిసి.. నా నేలతల్లి పంచిన మట్టి సువాసనలు… చిలుకల గుంపులు సాయంకాలాల్లో చెట్ల పై వాలి చేసే సరదా సందళ్ళు… మేస్తూ వేసే కోళ్ళ అరుపులు… ఎగురుతూ [...]

6
Mar

Nireekshana

Naa gnapakaala nadhee pravaham lo.. jalakanya laa vachi cheravu… sambarapadi sandramantha chotiddaamanukunte… egasi pade kerataala chote naa illannavu… intini cheravu… ne jaaada kosamani cheppi nadhi naina nenu, samudranne chediddamanukunte… samudrame nannu teeram lo mingesi nannu kanneti sandranni chesindi.. kanneeti sandramaina nenu.. kerataala roopu daalchi teeram lone vechi unna.. karuninchi sneha hasthaala jaadalu chupavaa…