18
Mar

Palle Sourabham

నా పల్లెసీమ గుర్తుకు వస్తోంది…
ఆ పచ్చని పైర చేలల్లో పశువులు మేపే గొల్లభామ కూడా గుర్తుకు వస్తోంది….
చెరువు గట్లపై చేపల వేట.. మామిడి చెట్ల పై చిన్ననాటి ఆటా పాట..
ముద్దబంతి తోటల్లో జంట తూనీగల సయ్యాట… అంతా నేడు గుర్తుకు వస్తోంది…

తొలకరి చినుకులకి తడిసి.. నా నేలతల్లి పంచిన మట్టి సువాసనలు…
చిలుకల గుంపులు సాయంకాలాల్లో చెట్ల పై వాలి చేసే సరదా సందళ్ళు…
మేస్తూ వేసే కోళ్ళ అరుపులు… ఎగురుతూ వాలే కొంగల గుంపులు…
అరటి తోటలు, పెరటి మొక్కలు.. ఆప్యాయత పంచే అమ్మలక్కలు..
చెరకు గడ్డలు.. నీటి గెడ్డలు.. బిందెలతో నీళ్ళు మోసే తెలుగింటి ఆడబిడ్డలు..

అమ్మ వారి తిరునాళ్ళు.. అమ్మ వండిన పూర్ణం బూరెలు..
అల్లరెక్కువైతే నాన్న వేసే మొట్టికాయలు…
ఇవి మన పల్లెటూళ్ళు… ధాన్యరాసులను పంచే కల్పతరువులు…

ఇవి ప్రతి ఒక్కరి పల్లెజీవన అనుభవాలు..
తలచుకుంటే ఒక్కసారి.. జన్మచాలు..

మీ మీ మనసులను ఆ కమ్మని జ్ఞాపకాలతో స్ప్రుశించండి..
మది హర్షిస్తుంది… కనులు ఆనందం తో వర్షిస్తాయి ..

Comments are closed.